ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు
- July 12, 2023
చైనా: చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు. చైనా రాయబార కార్యాలయం వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, పనుల కోసం భారతీయ పౌరులకు వీసాలు మంజూరు చేశామని ట్వీట్ చేశారు.
చైనా జాతీయుల పట్ల వీసా పరిమితులను త్వరగా ఎత్తివేయాలని చైనా, భారతదేశం మధ్య ప్రజల రాకపోకలను పునఃప్రారంభించాలని ఎదురుచూస్తున్నాం’’ వాంగ్ జియోజియాన్ మరో ట్వీట్ చేశారు.
2023 మొదటి ఐదు నెలల్లో చైనాకు వెళ్లే భారతీయులకు చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ 60,000 కంటే ఎక్కువ వీసాలు భారతీయులకు 71,600 వీసాలు జారీ చేసినట్లు మేలో ముందుగా వాంగ్ జియాజియాన్ ప్రకటించారు. మూడేళ్లలో తొలిసారిగా భారత్‌తో సహా విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని మార్చిలో చైనా ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







