తమన్నా ఇలా అయితే కష్టమే సుమా.!
- July 12, 2023
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. అలాగే, తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాల్లోనూ తమన్నా స్టార్డమ్ దక్కించుకుంది. ఇటీవల ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌తో వివాదాస్పదమైంది.
గత రెండు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతోన్న తమన్నా, కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతిసారీ మళ్లీ పడి లేచిన కెరటంలా దూసుకొస్తోంది.
ఆ కోవలోనే ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోనూ తమన్నా నటిస్తోంది. ఇలా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తమన్నాలో ప్రత్యేకమైన డిగ్నిటీ కనిపించాలి. కానీ, కంప్లీట్ ఫేడవుట్ అనే ప్రచారం జరుగుతోంది.
బాబోయ్ తమన్నాని ఎందుకు తీసుకున్నార్రా ‘భోళా శంకర్’ కోసం అనేంతలా విమర్శలు వినిపిస్తున్నాయ్. దీనంతటికీ కారణం ఆమె ఎంచుకున్న ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి వెబ్ సిరీసే కావచ్చు.
ఈ సిరీస్‌లో తమన్నా చేసిన జుగుప్స కలిగించే పర్ఫామెన్స్ ఆమెపై వున్న ఒపీనియన్ చెడిపోయేలా చేసింది. మిల్కీ బ్యూటీ ఇమేజ్ కాస్తా ఫేడవుట్ డర్టీ బ్యూటీ తమన్నా అన్నట్లుగా తమన్నాపై విమర్శల అస్త్రం గుప్పిస్తున్నారు.
ఇలా అయితే, ఇకపై తమన్నా కెరీర్ కాస్త కష్టమే అనిపిస్తోంది. ఇప్పటికైనీ తమన్నా ఈ విషయం గమనించుకుని తాను ఎంచుకునే ప్రాజెక్టుల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిదేమో.
తాజా వార్తలు
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్‌లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్‌పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!









