పాదయాత్ర చేపట్టబోతున్న హీరో విజయ్!
- July 12, 2023
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన విషయం ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా విజయ్ కు సంబంధించిన ఒక వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ సభ్యులతో విజయ్ తరచుగా సమావేశమవుతుంటారు. నిన్న కూడా వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన తాజా చిత్రం ‘లియో’ విడుదల కంటే ముందుగానే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ లోగానే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
మరోవైపు ఇటీవలే విజయ్ రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్స్, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఇదంతా కూడా రాజకీయ ఆరంగేట్రంలో భాగమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









