పాదయాత్ర చేపట్టబోతున్న హీరో విజయ్!
- July 12, 2023చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన విషయం ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా విజయ్ కు సంబంధించిన ఒక వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ సభ్యులతో విజయ్ తరచుగా సమావేశమవుతుంటారు. నిన్న కూడా వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన తాజా చిత్రం ‘లియో’ విడుదల కంటే ముందుగానే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ లోగానే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
మరోవైపు ఇటీవలే విజయ్ రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్స్, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఇదంతా కూడా రాజకీయ ఆరంగేట్రంలో భాగమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు