మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్త. రియాద్ ఎయిర్ హెచ్చరిక
- July 12, 2023
రియాద్: ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు మోసగాళ్ల గురించి జాగ్రత్తగా ఉండాలని రియాద్ ఎయిర్ హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే మోసపూరిత ప్రకటనలు, లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సర్క్యులేట్ అవుతున్న మోసపూరిత ప్రకటనలలో ఉద్యోగావకాశాల కోసం దరఖాస్తుదారుని నుండి దరఖాస్తు ఫీజుగా డబ్బును అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తుదారులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఏదైనా ప్రీ-ఫీజులు లేదా ప్రైవేట్ బ్యాంక్ ఖాతా వివరాలను అభ్యర్థించరని రియాద్ ఎయిర్ స్పష్టం చేసింది. ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ తమ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే తమ సమాచారాన్ని సమర్పించాలని ఎయిర్‌లైన్ పిలుపునిచ్చింది.
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పిఐఎఫ్) పూర్తి యాజమాన్యంలోని సంస్థ రియాద్ ఎయిర్ స్థాపనను 2023 ఏప్రిల్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. కొత్త జాతీయ క్యారియర్ సౌదీ నుండి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల దేశాల మధ్య సర్వీసులను ప్రారంభించనుంది. రియాద్ ప్రపంచానికి గేట్వేగా.. రవాణా, వాణిజ్యం మరియు పర్యాటకానికి ప్రపంచ గమ్యస్థానంగా మారడానికి ఇది వీలు కల్పిస్తుందని సౌదీ రూలర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







