ఉత్తర భారతదేశానికి యధాతథంగా ఫ్లైదుబాయ్ విమానాలు

- July 12, 2023 , by Maagulf
ఉత్తర భారతదేశానికి యధాతథంగా ఫ్లైదుబాయ్ విమానాలు

యూఏఈ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలకు విమాన సర్వీసులను యధాతథంగా నడుపుతున్నట్లు ఫ్లైదుబాయ్ వెల్లడించింది.  ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయని హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు.  కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 31 మంది మరణించారని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com