బహ్రెయిన్ లో గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ ప్లాన్
- July 13, 2023
బహ్రెయిన్: 2022–2023 ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్ గ్రాడ్యుయేట్ల సగటు 90% మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వారి కోసం స్కాలర్షిప్ ప్లాన్‌ను బహ్రెయిన్ విద్యా మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ జుమా ఆమోదించారు. అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు వివిధ అకడమిక్ స్పెషాలిటీలను కవర్ చేసే 6,000 స్కాలర్షిప్లు, గ్రాంట్ల కోసం పోటీ పడతారని మంత్రి తెలిపారు. వేలాది స్కాలర్షిప్లు మరియు గ్రాంట్ల కేటాయింపు విద్య రంగానికి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలు మద్దతుగా నిలిచారని డాక్టర్ జుమా పేర్కొన్నారు.
స్కాలర్షిప్లు, గ్రాంట్ల కేటాయింపు విద్యార్థుల అకాడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్కాలర్షిప్లు గ్రాంట్ల కోసం విద్యార్థులు www.bahrain.bhకి లాగిన్ అయి రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలని సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్ జూలై 14 శుక్రవారం వరకు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిం సమాచారం కోసం టెలిఫోన్: 17278777–17278417. పని వేళల్లో WhatsApp 17278777. ఇమెయిల్: [email protected], 17873046, 17875177, 1787302, లేదా 17873564 నంబర్లలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల కాల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







