బహ్రెయిన్ లో గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్లాన్

- July 13, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్లాన్

బహ్రెయిన్: 2022–2023 ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్ గ్రాడ్యుయేట్ల సగటు 90% మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వారి కోసం స్కాలర్‌షిప్ ప్లాన్‌ను బహ్రెయిన్ విద్యా మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ జుమా ఆమోదించారు. అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు వివిధ అకడమిక్ స్పెషాలిటీలను కవర్ చేసే 6,000 స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్‌ల కోసం పోటీ పడతారని మంత్రి తెలిపారు. వేలాది స్కాలర్‌షిప్‌లు మరియు గ్రాంట్‌ల కేటాయింపు విద్య రంగానికి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలు మద్దతుగా నిలిచారని డాక్టర్ జుమా పేర్కొన్నారు.

స్కాలర్‌షిప్‌లు,  గ్రాంట్‌ల కేటాయింపు విద్యార్థుల అకాడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  స్కాలర్‌షిప్‌లు గ్రాంట్‌ల కోసం విద్యార్థులు www.bahrain.bhకి లాగిన్ అయి రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలని సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్ జూలై 14 శుక్రవారం వరకు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిం సమాచారం కోసం టెలిఫోన్: 17278777–17278417. పని వేళల్లో WhatsApp 17278777. ఇమెయిల్: [email protected], 17873046, 17875177, 1787302, లేదా 17873564 నంబర్లలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల కాల్ చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com