ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌: చ‌రిత్ర సృష్టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారిణి..

- July 13, 2023 , by Maagulf
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌: చ‌రిత్ర సృష్టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారిణి..

బ్యాంకాక్‌: బ్యాంకాక్‌లో జ‌రుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల 100 మీట‌ర్ల హ‌ర్డిల్స్ రేసులో విజేత‌గా నిలిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది. విశాఖ‌కు చెందిన 23 ఏళ్ల జ్యోతికి అంత‌ర్జాతీయ పోటీల్లో ఇదే తొలి స్వ‌ర్ణం. గురువారం జ‌రిగిన ఫైన‌ల్స్‌లో జ‌పాన్ అథెట్లు టెరాడా సుకా(13.13 సెక‌న్లు), అయోకి మ‌సుమి(13.26 సెక‌న్ల) కంటే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసి 13.09 సెక‌న్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేరుకుంది. ఈ పోటీల చరిత్రలోనే 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి దేశానికి తొలి స్వర్ణం అందించింది. జ్యోతి జాతీయ రికార్డు 12.82 సెకన్లుగా ఉంది.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రెండో రోజు భారత్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. మహిళా 100 మీటర్ల హ‌ర్డిల్స్ రేసులో జ్యోతి యర్రాజీ, పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత అబ్దుల్లా అబూబకర్ లు స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com