భూగర్భ గదిలో దాచిన 1.8 మిలియన్ యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- July 14, 2023
సకాకా: అల్-జౌఫ్ ప్రాంతంలోని సకాకాలోని ఒక పొలంలో రహస్య భూగర్భ గిడ్డంగిలో దాచిన 1,882,198 యాంఫెటమైన్ మాత్రలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్‌వర్క్‌లపై సెక్యూరిటీ ఫాలో-అప్ కారణంగా డ్రగ్స్ రవాణాపై దాడులు చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి) ప్రతినిధి మేజర్ మార్వాన్ అల్-హజ్మీ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను, 3 సౌదీ పౌరులు, యెమెన్ నివాసిని అరెస్టు చేసినట్లు మేజర్ అల్-హజ్మీ వెల్లడించారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి ముందు వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మక్కా, రియాద్, అల్-షార్కియా ప్రాంతాలలో 911 మరియు సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ప్రమోట్ చేసే కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం రిపోర్ట్ చేయాలని ప్రజలను కోరారు. లేదా GDNC నంబర్: 995, ఇమెయిల్: [email protected]లో ద్వారా కూడా సమాచారం అందజేయవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







