భారత్ లోనే తొలి ఎలివేటెడ్ ట్యాక్సీవేను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- July 14, 2023
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢీల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవేను కేంద్రం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. శుక్రవారం (జులై 14.2023) విమానాల కోసం వంతెనలాంటి టాక్సీవే కలిగిన ఎయిర్ పోర్టు ఇదే కావటం విశేషం. ఈ విమనాశ్రయంలో ‘ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే’లతోపాటు నాలుగో రన్ వేను మంత్రి సింధియా ప్రారంభించారు.
భారతదేశంలోనే అతిపెద్ద విమానశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు. ఇక్క ప్రతీ రోజు 1500 కంటే ఎక్కువ విమనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.అటువంటి ఈ ఎయిర్ పోర్టులో ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవేతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే (ECT)లతోపాటు నాలుగో రన్ వే ను మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. 2.1 కిలోమీటర్ల పొడవు గల ఈ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే విమానం ల్యాండింగ్ తరువాత, విమానాలు బయలుదేరే ముందు టార్మాక్ పై ప్రయాణీకుల సమయాన్ని తగ్గిస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి సింధియా మాట్లాడుతు..దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని..కొత్తగా ఈసీటీ అందుబాటులోకి రావడంతో.. కింది నుంచి రోడ్డు మార్గం.. పైనుంచి వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఐజీఐఏ పేరొందిందని తెలిపారు.
కాగా..విమానాశ్రయంలోని టర్మినళ్లు, హ్యాంగర్లను రన్‌వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే టాక్సీవేలు. ఈసీటీ పొడవు 2.1 కి.మీలు. ఇది దిల్లీ విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్‌ఫీల్డ్‌లను అనుసంధానిస్తుంది. మూడో రన్‌వే నుంచి టర్మినల్- 1కి మధ్య దూరాన్ని ఏడు కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. ఏ-380, బీ-777, బీ-747 సహా వైడ్-బాడీ విమానాలు దీనిపైనుంచి రాకపోకలు సాగించవచ్చు.
ఇప్పటికే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రోజూ 1500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. మున్ముందు మరింత రద్దీని తట్టుకునేలా.. ప్రయాణికుల సమయం ఆదా చేసేలా సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఈ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









