సనద్ బాలిక హత్య. కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న బహ్రెయిన్ వ్యక్తి
- July 15, 2023
బహ్రెయిన్: సనద్‌లో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని కనుగొన్న కేసులో అరెస్టు చేసిన 35 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. నాల్గవ హై క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై హత్య, దాడికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసులు నిరూపితమైతే14 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తన చిత్రాలు మరియు వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తన నుండి డబ్బు డిమాండ్ చేయడానికి వాటిని ఉపయోగించిందని అందుకే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు కోర్టులో పేర్కొన్నాడు. తాను ఆమె మెడపై కొట్టిన తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయిందని, ఆమె నోరు మరియు ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైందన్నాడు. అనంతరం ఆమె గొంతు పిసికి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అనంతరం రోజంతా ఆమె మృతదేహాన్ని తన కారులో ఉంచానని, మరుసటి రోజు మృతదేహాన్ని సనద్ తీరానికి తీసుకెళ్లి, ఒక చెట్టు కింద పడేసి వచ్చినట్లు వివరించాడు. కోర్టు తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది. సనద్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో పాడుబడిన స్థితిలో బాలిక కుళ్ళిన మృతదేహాన్ని గతంలో అధికారులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా బాధితురాలిని గుర్తించామని, సాక్ష్యులు, బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను ఉపయోగించి సందర్భానుసార సాక్ష్యాలను ఉపయోగించామని అధికారులు తెలిపారు. దర్యాప్తు సమయంలో క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ చీఫ్, నేరస్థలం నుండి ఫోరెన్సిక్ నిపుణులచే నమూనాలు, కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









