దుబాయ్ ఫిట్‌నెస్ సెంటర్ బంపరాఫర్..!

- July 17, 2023 , by Maagulf
దుబాయ్ ఫిట్‌నెస్ సెంటర్ బంపరాఫర్..!

యూఏఈ: దుబాయ్‌లోని ఒక ఫిట్‌నెస్ సెంటర్ టీనేజర్ల కోసం ప్రత్యేకంగా కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌ను అందిస్తోంది. ఒక్క దిర్హామ్ కూడా చెల్లించకుండా ఒక నెల పాటు చేరడానికి వారిని అనుమతిస్తుంది. వేసవి సెలవుల్లో 13 - 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. యువకులు మోటార్ సిటీ, మీడియా సిటీ మరియు డౌన్‌టౌన్‌లో ఉన్న మూడు స్నాప్ ఫిట్‌నెస్ సెంటర్‌లలో దేనిలోనైనా చేరవచ్చు. ఒక నెల ఉచిత సభ్యత్వం కోసం నమోదు చేసుకోవడానికి వారి ఎమిరేట్స్ IDని చూపాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఆఫర్ జూలై నెల మొత్తం అందుబాటులో ఉంటుంది. పేర్లు వారు నమోదు చేసుకున్న రోజు నుండి 30-రోజుల ఉచిత సభ్యత్వం ప్రారంభమవుతుందని యూఏఈలోని స్నాప్ ఫిట్‌నెస్ COO అఫ్షాద్ మిస్త్రీ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com