సోషల్ మీడియాలో తాజా స్కామ్ అలెర్ట్..!

- July 17, 2023 , by Maagulf
సోషల్ మీడియాలో తాజా స్కామ్ అలెర్ట్..!

మస్కట్: నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా ఆకర్షణీయమైన ధరలకు గృహ కార్మికుల సేవలను అందజేసే ప్రకటనలకు సంబంధించి కొత్త స్కామ్ పై రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొత్త తరహా మోసాలపై హెచ్చరించింది. ఇందులో గృహ కార్మికులకు ఆకర్షణీయమైన ధరలకు సేవలు అందిస్తున్న కంపెనీకి నకిలీ ప్రకటనలు ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించింది. కంపెనీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి, నకిలీ ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్‌వే ద్వారా రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత, బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి వినియోగదారు బ్యాంక్ డేటా చట్టవిరుద్ధంగా పొందబడుతుందని హెచ్చరించింది. విశ్వసనీయత లేని వెబ్‌సైట్ల ద్వారా ఎలాంటి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను పంచుకోవద్దని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులందరినీ హెచ్చరించింది.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com