విడాకుల కేసుల్లో మస్కట్ గవర్నరేట్ కు అగ్రస్థానం

- July 17, 2023 , by Maagulf
విడాకుల కేసుల్లో మస్కట్ గవర్నరేట్ కు అగ్రస్థానం

మస్కట్: 2022లో మస్కట్ గవర్నరేట్ అత్యధిక విడాకుల కేసులను నమోదు చేయడంతో ఇటీవలి కాలంలో విడాకుల కేసులు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) వెల్లడించింది. గత ఏడాది ఒక్క మస్కట్ గవర్నరేట్ నుంచే 970కి పైగా రిజిస్టర్డ్ విడాకుల పత్రాలు అందాయని ఎన్‌సీఎస్‌ఐ నివేదిక పేర్కొంది. 2022లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని గవర్నరేట్‌లలో 4,160 విడాకుల కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒమానీ జంటల మధ్య 3,682 కేసులు ఉండగా, ఒమానీ - ప్రవాస జంటలవి 208 కేసులు ఉన్నాయి.

మస్కట్ గవర్నరేట్‌లో 977 కేసులు, ధోఫర్ గవర్నరేట్‌లో 786, నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో 666 కేసులు నమోదయ్యాయని ఎన్‌సిఎస్‌ఐ డేటా వెల్లడించింది. ముసందమ్ గవర్నరేట్‌లో అత్యల్పంగా కేవలం 32 విడాకుల కేసులు నమోదు కాగా, అల్ వుస్తా గవర్నరేట్‌లో 41 నమోదయ్యాయి. 2022లో 4,160 డాక్యుమెంట్లు నమోదు కాగా, 2021 నుంచి విడాకుల కేసుల్లో 3,837 డాక్యుమెంట్లు నమోదయ్యాయి.

2022లో ఒమన్‌లో 15,400 వివాహాలు జరిగాయని, ఇందులో 14,127 మంది ఒమానీ జంటలు,  613 మంది ఒమానీలు- ప్రవాసుల మధ్య ఉన్నారని NCSI నివేదిక పేర్కొంది. అలాగే ఒమానీ మహిళలను వివాహం చేసుకున్న ప్రవాసులు 66 మంది ఉన్నారు. మస్కట్ గవర్నరేట్‌లో అత్యధికంగా 3,162 వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2021తో పోలిస్తే 50 శాతానికి పైగా వివాహాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 15,400 వివాహాలు మాత్రమే జరిగాయి, అయితే 2021లో 39,000 వివాహాలు జరిగాయి. ‘‘విడాకుల కేసుల పెరుగుదల యువకులు, తక్కువ విద్యా మరియు ఆర్థిక స్థాయిలు ఉన్న సమూహాలలో పెరుగుతోంది." అని సోషల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ డైరెక్టర్ డాక్టర్ జలాల్ బిన్ యూసఫ్ అల్ ముఖైనీ అభిప్రాయపడ్డారు. కొత్తగా పెళ్లయిన జంటలపై సోషల్ మీడియా ప్రభావంపై అల్ ముఖైనీ ఆందోళన వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com