కువైట్ లో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగుల తొలగింపు

- July 17, 2023 , by Maagulf
కువైట్ లో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగుల తొలగింపు

కువైట్: 2023 సంవత్సరం ప్రథమార్థంలో బహిష్కరణకు గురైన.. ఉద్యోగాల నుండి తొలగించబడిన ప్రవాసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగులను తొలగించారు. అదే సమయంలో బహిష్కరణ గణాంకాలు కూడా పెరుగుతున్నాయి. కాగా, ఈ నెలలో బహిష్కరణకు గురైన 1,000 కంటే ఎక్కువ మంది ప్రవాసులు బహిష్కరణ కేంద్రంలో ఉన్నారు. క్రిమినల్ లేదా దుష్ప్రవర్తన కేసులు, అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణ లేదా కువైట్ నుండి వారిని బహిష్కరించాలని న్యాయపరమైన తీర్పుల కారణంగా పలువురిని బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఈజిప్షియన్లు, బంగ్లాదేశీయులు ఉన్నారని నివేదిక పేర్కొంది. గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసిన 7,000 మందితో సహా గత సంవత్సరం దాదాపు 250,000 మంది శాశ్వతంగా కువైట్‌ను విడిచిపెట్టినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com