27న విడుదల కానున్న `అడవిలో లాస్ట్ బస్`
- May 15, 2016
లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం `అడవిలో లాస్ట్ బస్`. శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజశ్రీ సమర్పిస్తున్నారు. ఎస్.డి. అరవింద్ దర్శకత్వం వహించారు. ఆయనే బాణీలను కూడా సమకూర్చారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. చిత్ర విశేషాల గురించి సమర్పకురాలు పూజశ్రీ మాట్లాడుతూ ``సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కన్నడలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. సూపర్ కాన్సెప్ట్ తో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో రెండు పాటలున్నాయి. తొలిసారి బీబీసీలో ఈ సినిమా పాట ప్రదర్శితమైంది. రెండు పాటలను తెలుగులో రాకేందుమౌళి వెన్నెలకంటి రాశారు. నందు తుర్లపాటి రాసిన సంభాషణలు హైలైట్ అవుతాయి. డబ్బింగ్‌తో పాటు అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: అనంత అరసు, మాటలు: నందు తుర్లపాటి, పాటలు: రాకేందుమౌళి వెన్నెలకంటి, దర్శకత్వం, సంగీతం: ఎస్.డి.అరవింద్, సమర్పణ: పూజశ్రీ, నిర్మాణం: శ్రీ మంజునాథ మూవీ మేకర్స్.





తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









