కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
- July 18, 2023
న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున 4.25 గంటలకు బెంగళూరులోని చిన్మయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 79. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొట్టాయం జిల్లాలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి ఊమెన్ చాందీ 50 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు.
1970లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాందీ తొలిసారిగా పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో కె కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి అయ్యాడు. 2004 – 2006, 2011-2016 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్ సంతాపం తెలిపారు. ఈ రోజు ఒక లెజెండ్ ఊమెన్ చాందీని కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. మన ఆత్మల్లో ఎప్పటికీ ఆయన మాటలు ప్రతిధ్వనిస్తుంటాయి అని సుధాకరన్ ట్వీట్ చేశారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం