శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితా విడుదల
- July 19, 2023
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియన్ పాస్ పోర్ట్ 80వ స్థానంలో ఉంది. తాజా జాబితాలో ఇండియా ఐదు స్థానాలు ఎగబాకింది. సెనెగల్, టోగో వంటి దేశాల సరసన నిలిచింది. మన పాస్ పోర్ట్ తో వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా శ్రీలంక, జమైకా, రువాండా, థాయిలాండ్, ఇండొనేషియా వంటి 57 దేశాలకు ప్రయాణం చేయవచ్చు. 177 దేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా తప్పనిసరి. ఈ జాబితాలో అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు, రష్యా తదితర దేశాలు ఉన్నాయి.
మరోవైపు అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా సింగపూర్ పాస్ పోర్ట్ తొలి స్థానంలో నిలిచింది. జపాన్ ను అధిగమించి మోస్ట్ పవర్ ఫుల్ వీసాగా అవతరించింది. సింగపూర్ వీసాతో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. అత్యంత బలహీనమైన వీసాగా ఆఫ్ఘనిస్థాన్ వీసా చిట్ట చివరి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం