జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు

- July 19, 2023 , by Maagulf
జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు

హైదరాబాద్: యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవితలకు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రముఖ నిర్మాత అరవింద్ పరువునష్టం కేసు, జీవిత రాజశేఖర్ లకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011 లో జీవిత రాజశేఖర్ ల మీద వేసిన పరువు నష్టం కేసు దాఖలు చేయగా... అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ దంపతులకి 17వ అదనపు చీఫ్ మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) కోర్టు ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. జీవిత ఆమె భర్త రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్రీ గా రక్తం తెచ్చుకుంటూ, మార్కెట్ లో అమ్ముకుంటున్నారని 2011 సంవత్సరంలో రాజశేఖర్ దంపతులు విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ వారిద్దరిపై పరువునష్టం దావా వేశారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న మంచి పనుల మీద వీరిద్దరూ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆరోపిస్తూ అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అప్పటినుంచి కేసు కొనసాగగా తాజాగా నాంపల్లి కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. రాజశేఖర్‌ దంపతులు వెంటనే జరిమానా చెల్లించటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై పైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com