క్రిస్మస్ని టార్గెట్ చేసిన వెంకటేష్.!
- July 19, 2023
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.
ఇంత వరకూ రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఆసక్తికరంగా వున్నాయ్. ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
గ్లింప్స్‌లో వెంకటేష్‌ని చూపించిన విధానం చూస్తే, ఈ సినిమా చాలా పవర్ ఫుల్ యాక్షన్ కంటెంట్‌తో తెరకెక్కబోతోందని అర్ధమవుతోంది.
శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ విలన్ రోల్ పోషిస్తున్నాడు.
ఆండ్రియా మరో కీలక పాత్రలో కనిపించనుంది. పాప సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు ఇటీవల ఓ చిన్న హింట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఇక, సినిమాని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. డిశంబర్ 22 ‘సైంధవ్’ కోసం లాక్ చేశారు మేకర్లు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం