క్రిస్‌మస్‌ని టార్గెట్ చేసిన వెంకటేష్.!

- July 19, 2023 , by Maagulf
క్రిస్‌మస్‌ని టార్గెట్ చేసిన వెంకటేష్.!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. 

ఇంత వరకూ రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఆసక్తికరంగా వున్నాయ్. ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

గ్లింప్స్‌లో వెంకటేష్‌ని చూపించిన విధానం చూస్తే, ఈ సినిమా చాలా పవర్ ఫుల్ యాక్షన్ కంటెంట్‌తో తెరకెక్కబోతోందని అర్ధమవుతోంది. 

శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ విలన్ రోల్ పోషిస్తున్నాడు. 

ఆండ్రియా మరో కీలక పాత్రలో కనిపించనుంది. పాప సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు ఇటీవల ఓ చిన్న హింట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఇక, సినిమాని క్రిస్‌మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. డిశంబర్ 22 ‘సైంధవ్’ కోసం లాక్ చేశారు మేకర్లు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com