PBSK సామర్థ్యం పెంపునకు జోహో కార్పొరేషన్‌తో CGI దుబాయ్ ఒప్పందం

- July 19, 2023 , by Maagulf
PBSK సామర్థ్యం పెంపునకు జోహో కార్పొరేషన్‌తో CGI దుబాయ్ ఒప్పందం

యూఏఈ: దుబాయ్‌లోని భారతీయ సమాజానికి కాన్సులర్ సేవలు,  మద్దతును పెంపొందించే లక్ష్యంతో భారత కాన్సులేట్ జనరల్, దుబాయ్ (CGI, దుబాయ్), ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) అనేక కార్యకలాపాలను చేపట్టనుంది. 2020 నవంబర్ 1 న దుబాయ్‌లోని CGI ప్రాంగణానికి మార్చబడినప్పటి నుండి, PBSK కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. యూఏఈలోని పెద్ద భారతీయ సంఘం PBSK యాక్టివ్ కార్యక్రమాలను చేపడుతోంది. ప్రతి నెల సగటున 3,500 కాల్‌లు, ఇమెయిల్‌లు, వాక్-ఇన్‌లు నమోదు అవుతున్నాయి.  పెరుగుతున్న ఈ డిమాండ్‌ను పరిష్కరించడానికి మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, CGI దుబాయ్ ప్రముఖ భారతీయ CRM ప్రొవైడర్ జోహో కార్పొరేషన్‌తో కలిసి పనిచేయనుంది. దీంతో జోహో దాని అత్యాధునిక కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM) సిస్టమ్‌ ద్వారా PBSK హెల్ప్‌డెస్క్ కార్యకలాపాలు  సమగ్రంగా మారనున్నాయి. ఈ వ్యవస్థ PBSK నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.  కాన్సులర్ సేవలను కోరుకునే యూఏఈలోని భారతీయ కమ్యూనిటీ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి తెలిపారు.

“ప్రవాసీ భారతీయ సహాయ కేంద్ర కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు జోహో కార్పొరేషన్‌తో మా సహకారాన్ని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్‌లోని భారతీయ సమాజానికి మేము అందించే మద్దతు, సేవలను నిరంతరం మెరుగుపరచడం మా లక్ష్యం. సమర్థవంతమైన, సమయానుకూలమైన మరియు వ్యక్తిగతీకరించిన కాన్సులర్ సేవలను అందించడానికి మా కొనసాగుతున్న నిబద్ధతలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన దశ.  ఈ డిజిటల్ పరివర్తన మా సర్వీస్ డెలివరీలో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుందని మేము నమ్ముతున్నాము.’’ అని అన్నారు.  "25 సంవత్సరాలుగా, జోహో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందిస్తూ, అధిక సామర్థ్యాన్ని సాధిస్తోంది. గోప్యత మరియు భద్రతపై దృష్టి సారించడం అనేది మా బలం." అని జోహో మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (MEA) అధ్యక్షుడు హైదర్ నిజాం తెలిపారు. "భారత కాన్సులేట్ జనరల్‌కు విశ్వసనీయ భాగస్వామిగా మారడం, వారి సుస్థిరత లక్ష్యాలను సాధించడంలో వారికి మద్దతు ఇవ్వడం మాకు గౌరవంగా ఉంది." అని జోహో మిడిల్ ఈస్ట్,  ఆఫ్రికాలో రీజినల్ మేనేజర్ ప్రేమ్ ఆనంద్ వేలుమణి అన్నారు.

 PBSK గురించి
దుబాయ్‌లోని ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం. భారత ప్రభుత్వంచే సంక్షేమ కార్యక్రమం, కాన్సులర్ సేవలు అవసరమైన భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 24 గంటల 365 రోజుల సహాయాన్ని అందిస్తోంది. PBSK హెల్ప్‌డెస్క్‌ని యూఏఈలో దాని టోల్-ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు: 800 46342. చాట్‌బాట్‌ను CGI, దుబాయ్ వెబ్‌సైట్: www.cgidubai.gov.in లో కూడా సంప్రదించవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com