కొలువుల కొట్టం
- May 15, 2016పల్లే నవ్విందే...
కన్నతల్లి పిలిచిందే...
పట్టపగలు ఎడారి(గల్ఫ్) కొట్టంలో నిద్దుర పోతుంటే...
ఈ ఎడారి బిడ్డలను చూడమ్మా...
కొలువు కొట్టంలో కొట్టుమిట్టాడుతున్న,
నూవ్ కన్న కొడుకులను చూడమ్మా...
చెప్పుకోలేని బాదలు,
మనసిప్పి నవ్వలేని గడియాలు,
అందరిలోనే ఉన్నాము,
ఆగమాగమౌతున్నాము,
అందరున్న(ఎందరున్న)
అందని దూరంలో ఉండి,
బాద్యతల(బ్రతుకు) బండి లాగుతున్నాము,
మూగజీవులమై జీవిస్తున్నాము...
గొడ్డులమైన బాగుండమ్మా...
నూవ్ కన్న గడ్డపైన గడ్డి తింటూ,
చెట్లు చేమల్లో రెంకాలేస్తు,
వాగు వంకల్లో తానాలాడుతు,
పొద్దుగూకంగానే నీ గూటికి చేరి,
ముద్దుముద్దుగా నీముచ్చట్లో-
నిద్దుర పోదుమమ్మా,
మేం నిద్దుర పోదుమమ్మా...
~~శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము