ముగిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన
- July 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగి రావడానికి ముందు బీజేపీ అధ్యక్షుడు నడ్డాను పవన్ కలిశారు. గంటపాటు నడ్డాతో చర్చలు జరిపారు. నడ్డా నివాసంలో విస్తృత చర్చలు జరిగాయంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికల గురించి నడ్డా, పవన్ చర్చించారంటూ జనసేన ప్రెస్‌నోట్ విడుదల చేసింది. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులతో పాటు తాజా రాజకీయాలపైనా నడ్డా, పవన్ చర్చించారని వెల్లడించింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పవన్ కల్యాణ్‌కు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చిన ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. అభిమానులతో పవన్ సెల్ఫీలు దిగారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లారు. కాసేపట్లో పవన్‌కల్యాణ్ సమక్షంలో.. జనసేనలో చేరనున్నారు ఆమంచి కృష్ణమోహర్ సోదరుడు స్వాములు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







