యూఏఈ లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్..!

- July 21, 2023 , by Maagulf
యూఏఈ లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్..!

యూఏఈ: ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరు కొలమానాల విశ్లేషణను అందించే ఓక్లా అనే వెబ్ సర్వీస్ ప్రచురించిన స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. జూన్ నెలలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో యూఏఈ  ప్రపంచవ్యాప్తంగా 204.24 Mbps డౌన్‌లోడ్ వేగం, 22.72 Mbps అప్‌లోడ్ వేగంతో మొదటి స్థానంలో నిలిచింది. ఇండెక్స్ ప్రకారం, యూఏఈ2023 మొదటి అర్ధ భాగంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చి, మే మరియు జూన్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, ఏప్రిల్‌లో రెండవ స్థానంలో నిలిచింది.  స్థిర బ్రాడ్‌బ్యాండ్ వేగం విషయానికొస్తే.. జూన్‌లో 239.2 Mbps డౌన్‌లోడ్ వేగంతో UAE ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో , అరబ్ దేశాలలో ప్రాంతీయంగా మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ 247.29 Mbps వేగంతో అగ్రస్థానంలో నిలిచింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com