యూఏఈ రోడ్లపై 13 శాతం పెరిగిన పెద్ద ప్రమాదాలు
- July 22, 2023
యూఏఈ: ఇటీవల రోడ్డు భద్రతపై ఓపెన్ డేటాను అంతర్గత మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అయితే ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్యతోపాటు పెద్ద ట్రాఫిక్ ప్రమాదాల కేసులు గత సంవత్సరం స్వల్పంగా పెరిగాయని పేర్కొన్నారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు శని, ఆదివారాల్లో జరుగుతున్నాయని నివేదికలో తెలిపారు. MOI 2022 రోడ్ సేఫ్టీ స్టాటిస్టిక్స్ ప్రకారం.. గత సంవత్సరం UAE రోడ్లపై జరిగిన 343 మరణాలలో 55 శనివారం, మరో 55 ఆదివారం రోజున సంభవించాయి. మొత్తం మరణాలలో 32 శాతం వీకెండ్లో జరిగినవే కావడం గమనార్హం. 2022లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన మొత్తం 5,045 మందిలో 32 శాతం మంది శని, ఆదివారాల్లో లేదా 818 మంది, 796 మంది గాయపడ్డారు. వారంలో మూడవ ప్రమాదకరమైన రోజు శుక్రవారం. 52 (15 శాతం) మరణాలు, 739 (15 శాతం) గాయాలు చోటుచేసుకున్నాయి.కేవలం 39 (11 శాతం) మరణాలు, 657 (13 శాతం) గాయాలతో వారంలో "అత్యల్ప ప్రమాదకరమైన" రోజుగా సోమవారం నిలిచింది. సాయంత్రం వేళల్లో రోడ్డుపై వెళ్లడం అత్యంత ప్రమాదకరమని MOI నివేదిక తెలిపింది. 37 శాతం (127) మరణాలు, 40 (2,033) శాతం గాయాలు నమోదయ్యాయి. 16 శాతం (55) మరణాలు, 16 శాతం (804) నమోదైన గాయాలతో మధ్యాహ్నం సాపేక్షంగా సురక్షితమని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, దుబాయ్ పోలీసుల ప్రకారం.. గత సంవత్సరం ఎమిరేట్‌లో 31,783 రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు 87 కార్లు లేదా ప్రతి గంటకు దాదాపు 4 కార్లు నిబంధనలు ఉల్లంఘించాయి. దుబాయ్‌లో ట్రాఫిక్ చట్టానికి చేసిన సవరణలు జూలై 6 నుండి అమలులోకి వచ్చాయి.
2022లో 343 మరణాలు, 2021లో 318తో పోలిస్తే 10% తగ్గాయి.
2022లో 5,045 మంది గాయపడ్డారు. 2021లో 4,377 మందితో పోలిస్తే 15% పెరిగింది.
2022లో 3,945 పెద్ద ప్రమాదాలు, 2021లో 3,488తో పోలిస్తే 13% పెరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







