మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
- July 22, 2023
సియోల్: ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలతో కొరియన్ పీఠభూమిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. శనివారం కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యోన్‌హాప్ చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రయోగాలు జరిగినట్లు చెప్పారు. దీంతో కొరియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, బుధవారం ఉదయం ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అవి జపాన్ సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ప్యాంగాంగ్ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







