$2 బిలియన్లకు చేరుకున్న ఒమన్, టర్కియే వాణిజ్యం
- July 23, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, టర్కియే మధ్య వాణిజ్య మార్పిడి నిరంతర వృద్ధిని సాధిస్తోంది. 2022లో దాదాపు $2 బిలియన్లకు చేరుకుంది. 2017 నుండి సుల్తానేట్ ఆఫ్ ఒమన్, టర్కియే మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతూ 2022లో దాదాపు $2 బిలియన్ US డాలర్లకు చేరుకుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. టర్కియో నుండి మొత్తం ఒమానీ దిగుమతులు $1.58 బిలియన్లు కాగా, టర్కియేకి మొత్తం ఒమానీ ఎగుమతులు $465 మిలియన్లకు చేరుకున్నాయి. ఒమన్ సుల్తానేట్‌కు రిపబ్లిక్ ఆఫ్ టర్కియే రాయబారి ముహమ్మత్ హెకిమోగ్లు మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రంగాలలో ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా గత పదేళ్లలో రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సహకారం గణనీయంగా పెరిగిందని చెప్పారు. డుక్మ్‌లోని ప్రత్యేక ఆర్థిక జోన్‌లో టర్కీ పారిశ్రామిక జోన్‌ను ఏర్పాటు చేయడానికి పని జరుగుతోందన్నారు. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఉపాధి, ఆదాయం మరియు ఎగుమతి కోసం ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుందని, ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన తెలిపారు. 2022లో టర్కియేను సందర్శించిన ఒమానీ పర్యాటకుల సంఖ్య 130,000 దాటిందన్నారు. రెండు దేశాలకు వీసాల అవసరాన్ని ఈ సంవత్సరం చివరిలోపు రద్దు అయ్యే అవకావం ఉందన్నారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కియే రాయబారి గత ఫిబ్రవరిలో 10 టర్కీ ప్రావిన్సులను తాకిన భూకంపం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు ఒమన్ సుల్తానేట్ పంపిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







