తమిళ తంబీలూ.! మీరు కాస్త మారాలి - పవన్ కళ్యాణ్
- July 26, 2023
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచం గుర్తించదగ్గ స్థాయికి ఎదిగింది. అందుకు కారణం ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలే. ఆయా సినిమాల్లో కేవలం తెలుగు నటీ నటులే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమలకు చెందిన నటీనటులు భాగం పంచుకున్నారు.
అయితే, తమిళ పరిశ్రమలో ఆ పరిస్థితి లేదు. తమిళ నాట తమిళ నటీనటులకు మాత్రమే అవకాశాలివ్వాలన్న నియమం పెట్టుకున్నారు. అందరూ కాకపోయినా కొందరు తమిళ పెద్దలు ఈ నిర్ఞయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే, ఇతర భాషా సినిమాల్లో నటించకూడదన్న నియమం కూడా వారి రూల్ పట్టికలో చేర్చుకున్న పరిణామాన్ని ఈ మధ్య చూస్తున్నాం.
కానీ, అలాంటి నియమాల వల్ల పరిశ్రమ దెబ్బ తింటుందనీ, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమ ఒకే తాటిపై నడవాలనీ, అలా నడిస్తేనే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందనీ తాజాగా పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పారు. ఎ.ఎమ్.రత్నం వంటి చాలా మంది సినిమాయే ప్యాషన్ అనుకుని బతికే కొందరు నిర్మాతలు బాగుపడాలన్నా, ఓవరాల్‌గా తమిళ ఇండస్ర్టీ వృద్ధి చెందాలన్నా తమిళ పెద్దల్లో ఈ మార్పు అవసరం అని పవన్ కళ్యాణ్ సూచించారు. మరి, పవన్ మాటను తమిళ పెద్దలు పట్టించుకుంటారా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









