యూఏఈ అధ్యక్షుడి సోదరుడు కన్నుమూత. 3 రోజులపాటు సంతాప దినాలు
- July 27, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోదరుడు, అబుధాబి పాలకుడి ప్రతినిధి షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న షేక్ సయీద్ ఈరోజు కన్నుమూశారు. సోదరుడి మృతికి యూఏఈ అధ్యక్షుడు సంతాపాన్ని తెలియజేశారు. ప్రెసిడెన్షియల్ కోర్ట్ మూడు రోజుల పాటు అధికారిక సంతాపాన్ని ప్రకటించింది.
అల్ ఐన్‌లో 1965లో షేక్ సయీద్ జన్మించారు. జూన్ 2010లో అబుధాబి పాలకుడి ప్రతినిధిగా నియమితులయ్యారు. అబుధాబిలో ప్లానింగ్ విభాగానికి అండర్ సెక్రటరీగా వ్యవహారిస్తున్నారు. అతను షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ADCED) మాజీ సభ్యుడిగా.. షేక్ సయీద్ బిన్ జాయెద్ మారిటైమ్ పోర్ట్ అథారిటీ (అబుదాబి) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









