ఉందా..? లేదా..? చిత్రం ప్రారంభం.

- May 16, 2016 , by Maagulf
ఉందా..? లేదా..? చిత్రం ప్రారంభం.

రామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్స్ బ్యానర్ పై అమనిగంటి వెంకట శివ ప్రసాద్ దర్శకత్వంలో అయితం.s.కమల్ నిర్మిస్తున్న చిత్రం 'ఉందా.. లేదా..?'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరధ్వాజ క్లాప్ కొట్టగా.. ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సంధర్భంగా

దర్శకుడు అమనిగంటి వెంకట శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ''సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇదొక కొత్త వెర్షన్ సినిమా. రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. ప్రేమ కథ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది'' అని చెప్పారు.

నిర్మాత అయితం.s.కమల్ మాట్లాడుతూ.. ''ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. మే చివరి నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది'' అని చెప్పారు.

హీరో రామకృష్ణ మాట్లాడుతూ.. ఓ మంచి కథ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది..''ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ''స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే కథ. ఇంటెర్వెల్ బ్యాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలుగుతుంది'' అని చెప్పారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి ఎందరో దర్శక నిర్మాతలు వస్తున్నారు. వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. అదే విధంగా ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ-దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్, నిర్మాత: అయితం.ఎస్.కమల్, సినిమాటోగ్రాఫి: ప్రవీణ్ కె బంగారి, మ్యూజిక్: శ్రీమురళి, కొరియోగ్రాఫర్: నందు జెన్నా, విఎఫ్ఎక్స్: మణికాంత్ అండ్ సాగర్&nbs

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com