అల్ బతీన్ శ్మశానవాటికలో షేక్ సయీద్ అంత్యక్రియలు
- July 28, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ బతీన్ శ్మశానవాటికలో షేక్ సయీద్ బిన్ జాయెద్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు అబుదాబిలోని షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ మొదటి మసీదులో రాష్ట్రపతి, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అతని కుటుంబం తన సోదరుడి కోసం నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.



ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి మరియు రాష్ట్రపతి కోర్టు మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ కూడా మస్జీదులో నిర్వహించిన ప్రార్థనల్లో కనిపించారు. ప్రార్థన తర్వాత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మన్సూర్ బిన్ జాయెద్ షేక్ సయీద్ మృతదేహాన్ని అంతిమ సంస్కారం కోసం తరలించారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







