అల్ దైద్ ఫెస్టివల్ లో 40 రకాల ఖర్జూరాలు
- July 28, 2023
యూఏఈ: యూఏఈలో 40 రకాల ఖర్జూరాలను పండిస్తున్నారని మీకు తెలుసా? మీరు వాటిని చూడాలన్న, తినాలన్నా అల్ దైద్ డేట్స్ ఫెస్టివల్ కు వెళ్లాల్సిందే. జులై 27న ప్రారంభమైన ఈ డేట్స్ ఫెస్టివల్ జులై 30 వరకు కొనసాగుతుంది. డేట్స్ తోపాటు ఈ ఫెస్టివల్ లో స్థానిక రైతులు నాలుగు రకాల మామిడి, నిమ్మకాయలు, బొప్పాయి, అరటి మరియు ఇతర పండ్లతో సహా ఇతర ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఎమిరాటీ మహిళలు అల్ ధైద్ డేట్స్ ఫెస్టివల్ లో భాగంగా పొడి తాటి ఆకులతో తయారు చేసిన హస్తకళా వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఫెసివల్ లో పాల్గొనే వారు ప్రతి విభాగంలో Dh1,000 నుండి Dh25,000 వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. అల్ రతాబ్ బ్యూటీ, అతిపెద్ద ఖర్జూర శాఖ, ఉత్తమ నిమ్మకాయలు, అత్తి పండ్ల పోటీ, అల్ హెసీల్ ఖర్జూర పోటీ, అత్యంత అందమైన ఖర్జూరం (మహిళలకు మాత్రమే రిజర్వు చేయబడింది) వంటి విభాగాలలో పోటీలను నిర్వహిస్తారు. సందర్శకులు తమ సొంత పెరట్లో పెంచుకునేందుకు ఖర్జూర మొక్కలను కొనుగోలు చేయడంతోపాటు స్వయంగా వ్యవసాయ నిపుణుల నుండి విలువైన సలహాలను పొందవచ్చు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







