రానా కొత్త డెసిషన్..! లెగసీని కంటిన్యూ చేయడానికే.!

- July 31, 2023 , by Maagulf
రానా కొత్త డెసిషన్..! లెగసీని కంటిన్యూ చేయడానికే.!

ప్రముఖ నిర్మాత రామా నాయుడుకి వారసుడిగా రానా దగ్గుబాటి నిర్మాణ రంగంలోనూ దూకుడు ప్రదర్శించాలనుకుంటున్నాడు కాబోలు. ఇప్పటికే విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రానా.

సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ నటనలో తనదైన సత్తా చూపిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య పెద్దగా సినిమాలు రావడం లేదు. 

అయినా ఆ బ్యానర్‌ని తండ్రి సురేష్ బాబు ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. తాజాగా రానా కొత్త నిర్మాణ సంస్థని రూపొందించి అభిరుచి గల సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. స్పిరిట్ మీడియా అనే పేరుతో తాజాగా ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘మాయా బజార్’ అనే వెబ్ సిరీస్‌ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అలాగే, దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ కొత్త సినిమాని ఇదే బ్యానర్‌లో రానా రూపొందించబోతున్నారు. అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు తన కొత్త బ్యానర్‌లో రూపొందించాలనుకుంటున్నాడట రానా. 

అన్నట్లు రానా హీరోగా రూపొందబోయే ‘హిరణ్యకశ్యప’ సినిమా కూడా ఇదే బ్యానర్‌లో రూపొందబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com