‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో విశ్వక్ సేన్ ఏం చెప్పబోతున్నాడంటే.!
- July 31, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా సినిమాకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇసుక మాఫియా కథాంశంగా ఈ సినిమా వుండబోతోందని మాట్లాడుకుంటున్నారు. ‘డీజె టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో జోడీ కడుతోంది.
కాగా, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ విశ్వక్ చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇంకో ఎత్తు.. అనేలా ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. ‘దాస్ కా ధమ్కీ’ అంటూ ఇటీవల ఓ మోస్తరు హిట్ తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్, ఈ సారి ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







