2023 క్యూ2లో 1.1% వృద్ధిని నమోదు చేసిన సౌదీ జీడీపీ
- August 01, 2023
రియాద్: జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, సౌదీ అరేబియా వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (GDP) 2023 రెండవ త్రైమాసికంలో 1.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 రెండవ త్రైమాసికానికి సంబంధించిన జిడిపి అంచనాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం క్యూ2లో చమురుయేతర కార్యకలాపాలలో 5.5 శాతం పెరుగుదలను చూపించాయి. 2022 రెండవ త్రైమాసికంతో పోలిస్తే చమురు కార్యకలాపాలు 4.2 శాతం తగ్గాయని నివేదికలో పేర్కొన్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం రెండవ త్రైమాసికంలో కాలానుగుణంగా సర్దుబాటు చేయబడిన వాస్తవ GDP 0.1 శాతం తగ్గుదలని చూపించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







