ఒమన్ లో పర్యటిస్తున్నభారత నావికాదళ అధిపతి
- August 01, 2023
మస్కట్: ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు, ఒమన్ సైనిక నాయకత్వంతో ఉన్నత స్థాయి చర్చల కోసం భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మూడు రోజుల ఒమన్ పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో నావల్ స్టాఫ్ చీఫ్, రాజ కార్యాలయ మంత్రి జనరల్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్-నుమానీని కలిశారు. ఒమన్ రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసర్ బిన్ మొహసేన్ అల్-రహ్బీ మరియు ఒమన్ రాయల్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ మటర్ బిన్ సలీం బిన్ రషీద్ అల్ బలూషితో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అతను ఒమన్లోని కీలక రక్షణ, శిక్షణా సంస్థాపనలను కూడా సందర్శించనున్నారు.
అంతకుముందు ఆదివారం మస్కట్ చేరుకున్న నేవల్ చీఫ్ కు ఒమన్ రాయల్ నేవీ కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసిర్ బిన్ మొహ్సిన్ అల్-రహ్బీ , ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ స్వాగతం పలికారు. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సందర్శన సందర్భంగా స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ INS విశాఖపట్నం మస్కట్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్ వద్దకు చేరుకుంది. ఒమన్ రాయల్ నేవీతో వివిధ నావికా సహకార కార్యక్రమాలు ఆగస్ట్ 3న ముగియనున్న మారిటైమ్ పార్టనర్షిప్ ఎక్సర్ సైజులో ఇది పాల్గొంటుంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







