బిగ్‌బాస్ రియాల్టీ షోపై ఉన్నత న్యాయం స్థానం నిర్లక్ష్య ధోరణి వహిస్తోందా.?
- August 01, 2023
బుల్లితెర బిగ్ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ రియాల్టీ షో వస్తుందంటే చాలు మీడియాలో ఎక్కడ లేని విమర్శల ధోరణి మొదలవుతుంది. అందుకు కారణం ఇదో రియాల్టీ షో. సినిమాలకున్నట్లు దీనికి సెన్సార్ కట్స్ వుండవు.
ఇదే అన్ని అనర్ధలకీ కారణం. విచ్చల విడిగా జుగుప్స కలిగించే మాటలు, చేష్టలతో రెచ్చిపోతుంటారు ఈ షోలో కంటెస్టెంట్లు. అందుకే ఈ షో స్టార్టవుతుందంటే చాలు, మీడియాలో అనేక రకాల కథనాలు ముందు నుంచే కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుంటాయ్.
తాజాగా ఉన్నత న్యాయం స్థానం బిగ్‌బాస్ రియాల్టీ షోపై చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్. ఈ షో ప్రసారానికి ముందు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి వీల్లేదనీ, షో ప్రసారం తర్వాత ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే ఫిర్యాదు చేయొచ్చుననీ కోర్టు వ్యాఖ్యానించింది.
కోర్టు వ్యాఖ్యలపై మేథావులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి చోద్యం.! ఇలాంటి రియాల్టీ షోలపై ఉన్నత న్యాయ స్థానాల తీరు తెన్ను ఈ విధంగా వుండడంతో అయోమయానికి గురి చేస్తోందంటూ వారు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







