‘గుంటూరు కారం’.! ఈ నెగిటివిటీ ఏంటి గురూజీ.!
- August 01, 2023
‘గుంటూరు కారం’ సినిమా విషయంలో రకరకాల విమర్శలు తలెత్తుతున్నాయ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పలు రకాల కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే, అందుకు పూర్తి కారణం త్రివిక్రమ్ శ్రీనివాసే అంటూ మొత్తం నేరం ఆయనపైనే మోపేస్తున్నారట. ఓ సినిమా ఆలస్యం కావడానికి పలు రకాల కారణాలుంటాయ్. కేవలం దర్శకుడి పైనే మొత్తం నేరం మోపేస్తే ఎలా.?
వాస్తవానికి మహేష్ బాబు వైపు నుంచి కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణాలున్నాయ్. అలాగే, ఇతరత్రా తెర వెనక కారణాలు అనేకం వున్నాయ్. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ సినిమాలపై ఫోకస్ పెడుతోన్న కారణంగానే మహేష్ సినిమాని లైట్ తీసుకుంటున్నాడంటూ నేరం మోపేస్తున్నారు.
ఇదిలా వుంటే, అటు పవన్ సినిమాలపై త్రివిక్రమ్ జోక్యాన్ని కూడా తప్పు పడుతున్నారు కొందరు. డబ్బింగ్ సినిమాలకు పొలిటికల్ కలరింగ్ ఎందుకంటూ విమర్శిస్తున్నారు. అదేనండీ.! ‘బ్రో’లో కొన్ని చోట్ల త్రివిక్రమ్ తనదైన శైలిలో కాస్త పొలిటికల్ డైలాగుల మసాలా కూడా దట్టించారు. అదే ఇప్పుడు నేరమైపోయినట్లుంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







