రేస్‌లో గ్రేస్ చూపిస్తోన్న అనుపమ.!

- August 02, 2023 , by Maagulf
రేస్‌లో గ్రేస్ చూపిస్తోన్న అనుపమ.!

‘ప్రేమమ్’ సినిమాతో యూత్ మనసు కొల్లగొట్టి, ‘అఆ’తో ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. 

తొలుత గ్లామర్‌కి దూరంగా, హద్దులు గీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. దీంతో, పాప కెరీరే టర్న్ అయిపోయింది. 

ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ ప్రాజెక్ట్ నుంచి అనుపమ తప్పుకుందన్నారు. ఆ తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యింది. లేటెస్ట్‌గా వచ్చిన ఈ సినిమా టీజర్‌లో అన్‌లిమిటెడ్ హాట్‌నెస్‌తో అనుపమ కట్టి పడేసింది.

హీరో సిద్దు జొన్నలగడ్డతో ఘాటైన లిప్‌లాక్ సీన్లలోనూ నటించేసింది. దీంతో, బోల్డ్ క్యారెక్టర్లకూ తాను సై సై అని సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఓ బోల్డ్ మూవీ కోసం ఓ యంగ్ డైరెక్టర్ అనుపమని సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com