పవిత్ర కాబా వార్షిక ఉత్సవంలో మక్కా డిప్యూటీ ఎమిర్
- August 03, 2023
మక్కా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్ నాయకత్వం వహించారు. బుధవారం ఉదయం పవిత్ర కాబా వార్షిక ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రాండ్ మసీదుకు చేరుకున్న తర్వాత కాబా గోడలను లోపలి నుండి గులాబీ, కస్తూరి పరిమళాలలో ముంచిన తెల్లటి క్లాత్ ముక్కలతో తుడిచివేయడం ద్వారా కాబాను శుభ్రం చేసారు. అంతకుముందు డిప్యూటీ ఎమిర్‌ను రెండు పవిత్ర మసీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ హెడ్ షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ స్వాగతించారు. క్లీనింగ్ వేడుక తర్వాత డిప్యూటీ ఎమిర్ తవాఫ్ (కాబా చుట్టూ ప్రదక్షిణలు) చేసి, ఆపై ప్రార్థనలు చేశారు. సౌదీ చక్రవర్తి లేదా అతని ప్రతినిధి పవిత్ర కాబా వార్షిక ఉత్సవంలో పాల్గొనడం ఆచారంగా ఉంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









