యూఏఈలో వడగళ్ళు, భారీ వర్షం..!

- August 04, 2023 , by Maagulf
యూఏఈలో వడగళ్ళు, భారీ వర్షం..!

యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో వడగళ్ళు పడటంతో వాతావరణ అధికారులు ఎల్లో, ఆరేంజ్ హెచ్చరికలను జారీ చేశారు. షార్జాలో ముఖ్యంగా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డు మీదుగా అల్ మాడమ్ పై గురువారం సాయంత్రం 4.30 గంటలకు వడగళ్ల వాన కురిసింది. ఎమిరేట్‌లోని అల్ ర్వైదా, అల్ ఫయా మరియు అల్ బహయేస్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో దుబాయ్ సమీపంలోని షార్జాలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.  నివాసితులు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  అస్థిర వాతావరణం నేపథ్యంలో డ్రైవర్లు రోడ్లపై మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ప్రతి ఒక్కరూ అధికారిక సమాచార వనరులపై మాత్రమే ఆధారపడాలని, పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని ఎన్సీఎం పిలుపునిచ్చింది. 

 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com