ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని టి.గవర్నర్‌ తమిళిసై

- August 04, 2023 , by Maagulf
ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని టి.గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిఎం కెసిఆర్‌‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది.

ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. రెండు రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బిఆర్‌‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. శుక్ర, శనివారాల్లో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్‌‌ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com