పవన్ కోసం హరీష్ శంకర్.! అక్కడా ఇక్కడా.!

- August 04, 2023 , by Maagulf
పవన్ కోసం హరీష్ శంకర్.! అక్కడా ఇక్కడా.!

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’‌ కి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ తెర పైకి వచ్చింది. దాదాపు ఆగిపోయిందనుకున్న ఈ ప్రాజెక్ట్‌ని ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయ్యారట. దాంతో, ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. 

అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా వున్న కారణంగా, ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్‌లోనే వుండాల్సి వస్తుంది. సో, అక్కడే సెట్స్‌లో ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. 

అలాగే, సేమ్ సెట్స్ అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణాలోనూ వేసి పవన్ కళ్యాణ్ వున్న సీన్లను అక్కడ షూట్ చేసి, పవన్ కళ్యాణ్ లేని సీన్లను తెలంగాణాలో షూట్ చేసేయాలని అనుకుంటున్నారట. 

అందుకోసం అక్కడా ఇక్కడా సేమ్ సెట్స్ వేసి మొత్తం సినిమాని సెట్స్‌లోనే కానిచ్చేద్దామనుకుంటున్నారట. ఓ వైపు ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు రాజకీయ వ్యవహారాలు కూడా చక్కబెడుతున్నసంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ‌ని ఎలక్షన్స్‌కి ముందే కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. అదీ సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com