‘గుంటూరు కారం’ మహేష్ లేకుండానే.!

- August 04, 2023 , by Maagulf
‘గుంటూరు కారం’ మహేష్ లేకుండానే.!

‘గుంటూరు కారం’ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్‌లో వున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ నుంచి రిలీవ్ అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపై ‘గుంటూరు కారం’పై ఫోకస్ పెట్టబోతున్నారు. 

ఈ లోపు మహేష్ బాబు విదేశీయానం ముగించుకుని రానున్నారు. ప్రస్తుతం విదేశీ యానంలో వున్న మహేష్ బాబు ఈ నెల 16 న ఇండియాలో ల్యాండ్ అవ్వనున్నారట. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ లోపే తాజా షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారట. మహేష్ బాబు లేకుండానే కొన్ని సీన్లు చిత్రీకరించబోతున్నారట. 

అన్నట్లు, హీరోయిన్‌ పూజా హెగ్ధేతో పాటూ, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా మారిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాటోగ్రాఫర్‌తోనే తాజా షెడ్యూల్ రన్ అవ్వనుందట. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com