ఫిలాసపీ మాట్టాడుతోన్న మెగా డాటర్.! అసలేం జరిగింది.?
- August 04, 2023మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా నిహారిక విడాకులు తీసుకుంటోందట.. అనే వార్త అనవరసరంగా దుష్ప్రచారంగా మారింది. అయితే, ఎట్టకేలకు ఆ విషయాన్ని నిహారిక కొణిదెల డిక్లేర్ చేయడంతో, ఆయా గాలి వార్తలకు చెక్ పడింది.
తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విడాకులు తీసుకోవడం అనేది ఆమె పర్సనల్ విషయం. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయ్. అవి కొన్నిసార్లు నిహారికను బాధించేలా చేశాయని చెబుతోంది.
పర్సనల్ లైఫ్‌లోకి రావద్దని ఎంత చెప్పినా మీడియా పట్టించుకోవడం లేదు. జీవితం ఎటు వెళితే అటు ప్రయాణించడమే.. అలా కాదని ఇలాగే వెళ్లాలి.. ఇదే చెయ్యాలి.. అంటే అక్కడే ఆగిపోతాం.. ముందుకు వెళ్లలేం.. అంటూ ఆ పోస్ట్‌లో నిహారిక రాసుకొచ్చింది. గాలి వార్తలు ఎంతలా నిహారికను బాధించాయో.. అందుకు తాను ఇచ్చిన ఈ ఎక్సప్లనేషన్తో కూడిన ట్వీటే నిదర్శనం.
ప్రస్తుతం అన్నీ మర్చిపోయి నిహారిక సినిమాల్లో నటించేందుకు మళ్లీ ముందుకొచ్చింది. ఆల్రెడీ ఇటీవల ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. త్వరలో మరిన్ని మంచి ప్రాజెక్టుల్లో నిహారిక కనిపించబోతోందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం