ఉక్రెయిన్ సంక్షోభం. చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం

- August 05, 2023 , by Maagulf
ఉక్రెయిన్ సంక్షోభం. చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం

జెడ్డా: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై చర్చించేందుకు సౌదీ అరేబియా శనివారం జెడ్డాలో జాతీయ భద్రతా సలహాదారులు, అనేక దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ఉక్రేనియన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన మానవతా కార్యక్రమంలో భాగంగా ఉంది. సంక్షోభం ప్రారంభం నుండి రష్యా -ఉక్రేనియన్ నాయకత్వాలతో ఆయన టచ్ లో ఉన్నారు. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీసే పరిష్కారాన్ని చేరుకోవడంలో ఈ సమావేశం దోహదపడుతుందని, సంక్షోభం ప్రభావాలను తగ్గిస్తుందని సౌదీ అధికార యంత్రాంగం పేర్కొంది. దౌత్య మార్గాల ద్వారా సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే మార్గాలపై అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయాలు, సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com