నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ 82వ వర్ధంతి

- August 07, 2023 , by Maagulf
నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ 82వ వర్ధంతి

న్యూఢిల్లీ: బెంగాలీ సాహిత్యం,  సంగీతంతో పాటు భారత ఉపఖండంలోని కళలను సందర్భోచిత ఆధునికతతో పునర్నిర్మించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 82వ వర్ధంతి నేడు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1941 ఆగస్టు 7న 80 ఏళ్ల వయసులో ఠాగూర్ మరణించారు. అయితే, బంగ్లా క్యాలెండర్‌లోని శ్రబాన్ 22న బంగ్లాదేశ్‌లో అతని వర్ధంతి జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలను చేపడతాయి. బంగ్లాదేశ్ తోపాటు ఇండియా వ్యాప్తంగా ఆయన వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.

"రబీ" అనే మారుపేరుతో పిలువబడే ఠాగూర్.. బెంగాలీ నెల బైశాఖ్ 1268 (మే 7, 1861) 25వ తేదీన కలకత్తాలోని జోరాసాంకో భవనంలో దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు జన్మించాడు. బంగ్లా సాహిత్యంలోని వివిధ శైలులలో ఏడు దశాబ్దాల పాటు బంగ్లా భాష, సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. ఆయన రచించిన రాజకీయ మరియు వ్యక్తిగత అంశాలకు సంబంధించిన నవలలు, చిన్న కథలు, పాటలు, నృత్య-నాటకాలు, వ్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన "గీతాంజలి"కి 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. దీంతో నోబెల్ అందుకున్న మొదటి బెంగాలీ, నాన్-యూరోపియన్ కవిగా గుర్తింపు పొందారు. అదే విధంగా బంగ్లాదేశ్ జాతీయ గీతం "అమర్ షోనార్ బంగ్లా", భారతదేశ జాతీయ గీతం "జన గణ మన" రెండూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినవే కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com