దుబాయ్ లో 'హ్యాండ్లూమ్ డే' సందడి..చేనేత వస్త్రాల్లో కనువిందు చేసిన తెలుగు ఆడపడుచులు
- August 07, 2023
దుబాయ్: చేనేతల దినోత్సవం పురస్కరించుకుని దుబాయిలో తెలుగు వనితలు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన చేనేత చీరలు కట్టుకుని సందడి చేసారు. దుబాయ్ వాస్తవ్యులు లక్ష్మీ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఆగస్టు 5న దుబాయిలోని ఇండియా పాలెస్ లో జరిగింది. వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ, కుప్పడం, గద్వాల్, మంగళగిరి నుండి పట్టుచీరలు కాటన్ చీరలు కట్టుకొచ్చిన వనితలు చేనేతలపై తమ మక్కువ చాటుకున్నారు. భారతీయ చేనేతల ప్రాముఖ్యత గురించి, పవర్ లూమ్ చీరలకి హ్యాన్డ్ లూమ్ చీరలకి వ్యత్యాసం ఎలా కనిపెట్టాలి, చేనేతల ధరలు ఎందుకు హెచ్చుగా ఉంటాయి వంటి విషయాల పై వసంతలక్ష్మీ, నీలిమ ప్రసంగించారు.


లక్ష్మీరెడ్డి ద్వారా పోచంపల్లి నుండి ఒక మహిళా చేనేతకారిని, అనురాధ ద్వారా మంగళగిరి చేనేతకారిని ఈ సమూహం దత్తతు తీసుకున్నారు. ఇకపై పోచంపల్లి మంగళగిరి చీరలు ఎప్పుడు కొనాలన్నా ఈ చేనేతకారుల ద్వారానే తీసుకుని ఈ పరిశ్రమకు తమ వంతు సహాయం సహకారం అందించాలని అంగీకరించారు.
ఈ కార్యక్రమంలో నిర్వహించిన సరదా ఆటలకు బహుమతులుగా చేనేత చీరల ఇవ్వటం విశేషం.
ఈ కార్యక్రమానికి అందిన సహకారం ప్రొత్సాహం ఎంతో ఉత్సాహాన్నిచింది అని, ముందు ముందు తెలుగు రాష్టాల చేనేత పరిశ్రమ కోసం మన వంతు కృషి ఇంకా చేయాలి అని దుబాయి తెలుగు వనితలు సంకల్పించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







